డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్
- డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎంపిక
- ప్రతిపక్షంలోకి డీఎంకే.. అసెంబ్లీలో కీలక నియామకాలు
- శాసనసభాపక్ష ఉపనేతగా కేఎన్ నెహ్రూ, విప్‌గా ఈవీ వేలు
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పుల నేపథ్యంలో డీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. శాసనసభ్యుల ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందు ఆదివారం ఈ ప్రకటన వెలువడింది. ఉపనేతగా సీనియర్ నేత కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలును నియమించారు.
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ లభించలేదు. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో డీఎంకే కూటమిలోని పార్టీల మద్దతును టీవీకే కోరింది.
దీంతో డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్, టీవీకేకు మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు కూడా నటుడు సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్నట్టు తెలిపాయి. దీంతో 234 స్థానాల అసెంబ్లీలో విజయ్ సులభంగా మెజారిటీ సాధించి, ఆదివారం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మే 7న డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ తీర్మానం చేయడంతో పాటు, భవిష్యత్తులో అన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని స్టాలిన్‌కు అప్పగిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో, ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే తమ శాసనసభాపక్ష కార్యవర్గాన్ని ప్రకటించింది.